మార్చి 30న బుధవారం రోజు విడుదల అంటూ హడావిడి చేసిన ‘శక్తి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫూల్స్ డేగా పరిగణింపబడే ఏప్రిల్ 1న శుక్రవారం రోజు విడుదల కానుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని తమిళంలోనూ విడుదల చేస్తున్నందున సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేసారో..మరో కారణం వల్ల వాయిదా వేసారో తెలియాల్సి ఉంది. తెలుగులో విడుదలైన మరుసటి రోజు, అనగా ఏప్రిల్ 2న ఈ చిత్రం ‘ఓం శక్తి పేరుతో తమిళంలో విడుదలవుతోంది. ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు వారం రోజులు మునుపే పూర్తి చేయడం ఈ చిత్ర విజయంపై అభిమానుల్లో ఆశలు పెంచుతున్నప్పటికీ ఈ చిత్రాన్ని ఏరికోరి ఏప్రిల్ ఫస్ట్ న విడుదల చేసేందుకు సిద్దపడుతుండడం పట్ల అభిమానులు ఎలా రియాక్టవుతారో చూడాల్సి వుంది.
జూ ఎన్టీఆర్, ఇలియానా జంటగా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం 'శక్తి' సెన్సార్ నిన్న (మార్చి 24) పూర్తయింది. కట్స్ ఏమీ లేకుండా A సర్టిఫికేట్ పొందింది. కాగా, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1 న (ఫస్ట్ ఏప్రిల్) విడుదల చేస్తున్నారు. దీని రీరికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రాగ్ సిటీలో అంతర్జాతీయ స్థాయి కళాకారులతో నిర్వహించారు. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అత్యధిక వ్యయంతో నిర్మించిన తెలుగు సినిమాగా రికార్డుకెక్కింది. అలాగే, బిజినెస్ విషయంలో కూడా సంచలనం సృష్టించిందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంటున్నాయి

No comments:
Post a Comment